*రాష్ట్ర చౌక దుకాణాల డీలర్ల సంఘం ఉపాధ్యక్షుడుగా రవిచంద్ర బాబు ఏకగ్రీవ ఎంపిక.*
పలమనేరు సెప్టెంబర్26 ( పున్నమి ప్రతినిధి )
రాష్ట్ర చౌక దుకాణాల డీలర్ల సంఘం ఉపాధ్యక్షుడుగా పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డిపల్లి మండలం కోరి రవిచంద్ర బాబు ఏకగ్రీవ ఎంపిక అయినట్లు రాష్ట్ర చౌకదుకాణం డీలర్ల సంఘం అధ్యక్షుడు డివిలీలా మాధవరావు పేర్కొన్నారు. ఈ నెల 17 వతేది విజయవాడలో జరిగిన రాష్ట్ర సమ్మాఖ్యా మీటింగ్ లో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అన్నారు.బైరెడ్డిపల్లి చౌకదుకాణం డీలర్ మండల డీలర్ల సంఘం అధ్యక్షుడుగా,
ఆతరువాత జిల్లా డీలర్ల సంఘం అధ్యక్షుడు గా,నేడు రాష్ట్ర స్థాయి పదవి అంచలంచలుగా
ఎదగటం విశేషం .బైరెడ్డిపల్లి లో 85 సంవత్సరాలుగా చౌకదుకాణం డీలర్ గా కోరి వాళ్ళ కుటుంభం నేటివరకు కొనసాగడం వారి కుటుంబీకులు బాధ్యత గా,పారదర్శ కంగా ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి ప్రజలు ,అధికారుల మన్ననలు పొందారు.ఈ నేపద్యంలో కొరి బసవరాజ్ కుమారుడు ని పదవులు వరించింది అనడంలో సందేహం లేదు. ఈ సందర్భంగా కోరి రవిచంద్ర బాబు మాట్లాడుతూ తనకు లభించిన రాష్ట్ర పదవికి న్యాయం చేస్తూ,డీలర్ల సంక్షేమంకు కృషిచేసి అందరి మన్ననలు పొందుతాను అన్నారు.నన్ను
ఈ పదవికి ఏకగ్రీవంగా ఎంపికకు దోహదపడ్డ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.రాష్ట్ర నూతన కార్యవర్గం కు శుభాకాంక్షలు తెలిపారు.


