Friday, 2 October 2026
  • Home  
  • రాయలసీమ ప్రగతికి సరికొత్త బాట: మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఐఎస్‌ఏకు శంకుస్థాపనపాల్గొన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్, అనంత్ అంబానీ
- చిత్తూరు

రాయలసీమ ప్రగతికి సరికొత్త బాట: మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఐఎస్‌ఏకు శంకుస్థాపనపాల్గొన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్, అనంత్ అంబానీ

మదనపల్లె, అక్టోబర్ 02 (పున్నమి న్యూస్ ప్రతినిధి): రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చే సరికొత్త పారిశ్రామిక, వ్యవసాయ విప్లవానికి మదనపల్లె వేదికైంది. అన్నమయ్య జిల్లా మదనపల్లె పరిధిలో సుమారు రూ. 1 లక్ష కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటు చేయనున్న అంతర్జాతీయ స్థాయి ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’తో పాటు ప్రతిష్టాత్మక ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ (ISA) నిర్మాణ పనులకు శుక్రవారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. ఈ చారిత్రక ఘట్టానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రిలయన్స్ ప్రతినిధి అనంత్ అంబానీ తదితరులు హాజరై మొక్కలు నాటి ప్రాజెక్టు పనులను లాంఛనంగా ప్రారంభించారు. రిలయన్స్ గ్రూప్ సహకారంతో ఏర్పాటు కానున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా ఆధునిక సాంకేతికతతో కూడిన వ్యవసాయ విద్య, పరిశోధనలు రైతులకు మరింత చేరువకానున్నాయి. ఈ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో రాయలసీమ వ్యాప్తంగా పండ్ల తోటలు, ఉద్యాన పంటల సాగుకు గ్లోబల్ మార్కెట్ లభించనుండటంతో పాటు స్థానిక యువతకు వేలాదిగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అన్నదాతలను గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఈ బృహత్తర ప్రాజెక్టును పట్టాలెక్కిస్తోందని నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మదనపల్లె, అక్టోబర్ 02 (పున్నమి న్యూస్ ప్రతినిధి):
రాయలసీమ ముఖచిత్రాన్ని మార్చే సరికొత్త పారిశ్రామిక, వ్యవసాయ విప్లవానికి మదనపల్లె వేదికైంది. అన్నమయ్య జిల్లా మదనపల్లె పరిధిలో సుమారు రూ. 1 లక్ష కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటు చేయనున్న అంతర్జాతీయ స్థాయి ‘గ్లోబల్ హార్టికల్చర్ హబ్’తో పాటు ప్రతిష్టాత్మక ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ (ISA) నిర్మాణ పనులకు శుక్రవారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. ఈ చారిత్రక ఘట్టానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రిలయన్స్ ప్రతినిధి అనంత్ అంబానీ తదితరులు హాజరై మొక్కలు నాటి ప్రాజెక్టు పనులను లాంఛనంగా ప్రారంభించారు.
రిలయన్స్ గ్రూప్ సహకారంతో ఏర్పాటు కానున్న ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా ఆధునిక సాంకేతికతతో కూడిన వ్యవసాయ విద్య, పరిశోధనలు రైతులకు మరింత చేరువకానున్నాయి. ఈ హార్టికల్చర్ హబ్ ఏర్పాటుతో రాయలసీమ వ్యాప్తంగా పండ్ల తోటలు, ఉద్యాన పంటల సాగుకు గ్లోబల్ మార్కెట్ లభించనుండటంతో పాటు స్థానిక యువతకు వేలాదిగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అన్నదాతలను గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ఈ బృహత్తర ప్రాజెక్టును పట్టాలెక్కిస్తోందని నేతలు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.