నంద్యాల,జూలై 1, పున్నమి ప్రతినిధి :
జాతీయ చార్టెడ్ అకౌంటెంట్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కళాశాల చైర్మన్ డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చార్టెడ్ అకౌంటెంట్ పాలూరు గోపికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని సీఏ కోర్సు ప్రాధాన్యం, జీఎస్టీ, కామర్స్ రంగంలోని ఉపాధి అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కామర్స్ విద్యకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, డిగ్రీ అనంతరం విద్యార్థులు సీఏ వంటి ఉన్నత కోర్సులు అభ్యసించాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ కేబీవీ సుబ్బయ్య విద్యార్థులు ఇటువంటి అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం పాలూరు గోపికృష్ణను శాలువా, జ్ఞాపికతో కళాశాల యాజమాన్యం సత్కరించింది. కార్యక్రమంలో కామర్స్ విభాగాధిపతి డాక్టర్ డి. పుల్లయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఘనంగా సీఏ దినోత్సవం
నంద్యాల,జూలై 1, పున్నమి ప్రతినిధి : జాతీయ చార్టెడ్ అకౌంటెంట్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ రామకృష్ణ అటానమస్ డిగ్రీ కళాశాలలో కామర్స్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కళాశాల చైర్మన్ డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చార్టెడ్ అకౌంటెంట్ పాలూరు గోపికృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని సీఏ కోర్సు ప్రాధాన్యం, జీఎస్టీ, కామర్స్ రంగంలోని ఉపాధి అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ కామర్స్ విద్యకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, డిగ్రీ అనంతరం విద్యార్థులు సీఏ వంటి ఉన్నత కోర్సులు అభ్యసించాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ కేబీవీ సుబ్బయ్య విద్యార్థులు ఇటువంటి అవగాహన కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం పాలూరు గోపికృష్ణను శాలువా, జ్ఞాపికతో కళాశాల యాజమాన్యం సత్కరించింది. కార్యక్రమంలో కామర్స్ విభాగాధిపతి డాక్టర్ డి. పుల్లయ్య, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

