Saturday, 30 May 2026
  • Home  
  • మొత్తానికి కావలి ” గ్లాస్ “భళ్లుమనింది… రాజకీయచదరగం లో చిక్కిన జనసేన….
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మొత్తానికి కావలి ” గ్లాస్ “భళ్లుమనింది… రాజకీయచదరగం లో చిక్కిన జనసేన….

రాజకీయాల్లో పార్టీలు కొన్ని సందర్భంలోనే స్పందిస్తేనే ప్రజల్లో చేరుకుంటుంది. అనవసరమైన వివాదంలో పార్టీలు ఇరుక్కుంటే అటు ఆ పార్టీకి, నాయకుల్లో భారీ స్థాయిలో నష్టం జరిగే అవకాశం ఉంది. ఇదే కోవలో కావలి జనసేన రాజకీయ చదరంగంలో చిక్కుకొని కావలి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పరువు పోగొట్టుకున్న సందర్భం ఏర్పడింది . కావలి జనసేన నాయకులు . ప్రజా సమస్యలపై పోరాడి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలనే విషయం విస్మరించి ఎవరో ఫోన్లో మాట్లాడి రికార్డ్ చేసిన దానిపై మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ని నిందిస్తూ కావలి నడిబొడ్డు సెంటర్ ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో నిరసన తెలపడం పై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.. ఎవరో వేసిన రాజకీయం చదరంగంలో జనసేన బలిపశువైందని ప్రజలు అనుకుంటున్నారు. కావలి ప్రాంతంలో గత రెండేళ్లుగా ఎన్నో సమస్యలు కావలి ని చుట్టు ముట్టి నా జనసేన కనీసం ఆ వైపు కన్నెత్తి చూడలేదు. కరేడు రైతు ఉద్యమం, మత్స్య కారుల పడవల సమస్య పై కనీసం స్పందించని జనసేన నిజమో అబద్దమో తెలియని ఆడియో పై ఇష్టారీతిన రోడ్డు ఎక్కడా పార్టీ అధిష్టానం కు కూడా నచ్చలేదు.ఈ విషయంలో ఇన్ ఛార్జ్ అళహరి సుధాకర్ ను సంజాయిషీ అడుగగా తనకు ఏమీ తెలియదని అనడం తో లిస్ట్ పంపిస్తే అందరినీ సస్పెండ్ చేస్తామని తాళ్లూరి రామ్ అనడం తో సుధాకర్ వారించినట్టు సమాచారం. మార్ఫింగ్ రాజకీయాలతో కావలిలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.కూటమి అనుకూల శక్తుల కుట్రల ఫలితంగా… ప్రతిపక్ష నేతలపై దాడుల హెచ్చరికలతో ప్రజాస్వామ్యాన్ని, శాంతిభద్రతలను తీవ్రంగా దెబ్బతీసే విధంగా మారుతున్నాయని వైఎస్ఆర్సిపి నాయకులు, డి.యస్.పి కి ఫిర్యాదు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకొని‌ ప్రతాప్ కుమార్ రెడ్డి పేరుతో మార్ఫింగ్ చేసిన ఆడియోలను వైరల్ చేస్తూ రాజకీయంగా బురదజల్లే కుట్రలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు.వాస్తవాలకు ఏమాత్రం సంబంధం లేని ఆడియోలను సృష్టించి ప్రజల్లోకి నెట్టడం ద్వారా రాజకీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. అంతేకాకుండా, ఆ మార్ఫింగ్ ప్రచారాలను నమ్మి కొందరు రాజకీయ పార్టీ కార్యకర్తలు ప్రతాప్ కుమార్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తామని బహిరంగ హెచ్చరికలు చేయడం అత్యంత ప్రమాదకర పరిణామమని తెలిపారు. సోషల్ మీడియాలో నకిలీ ప్రచారాలు, మార్ఫింగ్ ఆడియోలు, దుష్ప్రచారాలు జరుగుతున్నా ప్రభుత్వం, పోలీసులు చూస్తూ ఊరుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు.ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై దాడుల బెదిరింపులు వచ్చినా చర్యలు తీసుకోకపోవడం వెనుక ఎవరి ప్రోత్సాహం ఉంది..? మార్ఫింగ్ ముఠాలను కాపాడుతున్నది ఎవరు..? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయని పేర్కొన్నారు. బుధవారం ప్రతాప్ రెడ్డి ఇల్లు ముట్టడి అని ఒకరు, 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని ఒకరు రకరకాల సవాళ్లు పోటీ పడి చేసిన వారు పత్తా లేకుండా పోవడానికి జనసేన అధిష్టానం ఆగ్రహం తో పాటు,ఆ ఆడియో ఫేక్ అనే సంకేతాలు ఇవ్వడంతో.. తిరిగి కేసులు పెడితే అనే ప్రశ్న రావడంతో మంగళవారం సాయంత్రం చూపిన ఆగ్రహావేశాలు.. ఏకపాత్రాభినయాలు.. బుధవారం నాటికి కనపడకుండా పోవడానికి…ఎన్నో కారణాలు అంట..

రాజకీయాల్లో పార్టీలు కొన్ని సందర్భంలోనే స్పందిస్తేనే ప్రజల్లో చేరుకుంటుంది. అనవసరమైన వివాదంలో పార్టీలు ఇరుక్కుంటే అటు ఆ పార్టీకి, నాయకుల్లో భారీ స్థాయిలో నష్టం జరిగే అవకాశం ఉంది. ఇదే కోవలో కావలి జనసేన రాజకీయ చదరంగంలో చిక్కుకొని కావలి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పరువు పోగొట్టుకున్న సందర్భం ఏర్పడింది . కావలి జనసేన నాయకులు . ప్రజా సమస్యలపై పోరాడి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలనే విషయం విస్మరించి ఎవరో ఫోన్లో మాట్లాడి రికార్డ్ చేసిన దానిపై మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ని నిందిస్తూ కావలి నడిబొడ్డు సెంటర్ ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో నిరసన తెలపడం పై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.. ఎవరో వేసిన రాజకీయం చదరంగంలో జనసేన బలిపశువైందని ప్రజలు అనుకుంటున్నారు. కావలి ప్రాంతంలో గత రెండేళ్లుగా ఎన్నో సమస్యలు కావలి ని చుట్టు ముట్టి నా జనసేన కనీసం ఆ వైపు కన్నెత్తి చూడలేదు. కరేడు రైతు ఉద్యమం, మత్స్య కారుల పడవల సమస్య పై కనీసం స్పందించని జనసేన నిజమో అబద్దమో తెలియని ఆడియో పై ఇష్టారీతిన రోడ్డు ఎక్కడా పార్టీ అధిష్టానం కు కూడా నచ్చలేదు.ఈ విషయంలో ఇన్ ఛార్జ్ అళహరి సుధాకర్ ను సంజాయిషీ అడుగగా తనకు ఏమీ తెలియదని అనడం తో లిస్ట్ పంపిస్తే అందరినీ సస్పెండ్ చేస్తామని తాళ్లూరి రామ్ అనడం తో సుధాకర్ వారించినట్టు సమాచారం.
మార్ఫింగ్ రాజకీయాలతో కావలిలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.కూటమి అనుకూల శక్తుల కుట్రల ఫలితంగా… ప్రతిపక్ష నేతలపై దాడుల హెచ్చరికలతో ప్రజాస్వామ్యాన్ని, శాంతిభద్రతలను తీవ్రంగా దెబ్బతీసే విధంగా మారుతున్నాయని వైఎస్ఆర్సిపి నాయకులు, డి.యస్.పి కి ఫిర్యాదు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాను ఆయుధంగా మార్చుకొని‌ ప్రతాప్ కుమార్ రెడ్డి పేరుతో మార్ఫింగ్ చేసిన ఆడియోలను వైరల్ చేస్తూ రాజకీయంగా బురదజల్లే కుట్రలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు.వాస్తవాలకు ఏమాత్రం సంబంధం లేని ఆడియోలను సృష్టించి ప్రజల్లోకి నెట్టడం ద్వారా రాజకీయ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. అంతేకాకుండా, ఆ మార్ఫింగ్ ప్రచారాలను నమ్మి కొందరు రాజకీయ పార్టీ కార్యకర్తలు ప్రతాప్ కుమార్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తామని బహిరంగ హెచ్చరికలు చేయడం అత్యంత ప్రమాదకర పరిణామమని తెలిపారు. సోషల్ మీడియాలో నకిలీ ప్రచారాలు, మార్ఫింగ్ ఆడియోలు, దుష్ప్రచారాలు జరుగుతున్నా ప్రభుత్వం, పోలీసులు చూస్తూ ఊరుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు.ప్రతిపక్ష నాయకుల ఇళ్లపై దాడుల బెదిరింపులు వచ్చినా చర్యలు తీసుకోకపోవడం వెనుక ఎవరి ప్రోత్సాహం ఉంది..?
మార్ఫింగ్ ముఠాలను కాపాడుతున్నది ఎవరు..? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయని పేర్కొన్నారు.
బుధవారం ప్రతాప్ రెడ్డి ఇల్లు ముట్టడి అని ఒకరు, 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని ఒకరు రకరకాల సవాళ్లు పోటీ పడి చేసిన వారు పత్తా లేకుండా పోవడానికి జనసేన అధిష్టానం ఆగ్రహం తో పాటు,ఆ ఆడియో ఫేక్ అనే సంకేతాలు ఇవ్వడంతో.. తిరిగి కేసులు పెడితే అనే ప్రశ్న రావడంతో మంగళవారం సాయంత్రం చూపిన ఆగ్రహావేశాలు.. ఏకపాత్రాభినయాలు.. బుధవారం నాటికి కనపడకుండా పోవడానికి…ఎన్నో కారణాలు అంట..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.