2026-27 విద్యా సంవత్సరం నుండి 9వ తరగతి విద్యార్థులు రెండు భారతీయ భాషలతో కలిపి మొత్తం మూడు భాషలు తప్పనిసరిగా చదవాలన్న సీబీఎస్‌ఈ (CBSE) నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్‌ఈ, ఎన్‌సీఈఆర్‌టీలకు నోటీసులు జారీ చేస్తూ, రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
భాష అనేది వ్యక్తిగత ఐచ్ఛికమని, దీన్ని బలవంతంగా రుద్దలేమని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. అయితే, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరించిన కోర్టు, తదుపరి విచారణను జులై రెండో వారానికి వాయిదా వేసింది.


