ఆదివాసీల పెన్షన్ అర్హతను భూమి విస్తీర్ణం ఆధారంగా నిర్ణయించడం అన్యాయమని కాంగ్రెస్ ఆదివాసీ రాష్ట్ర వైస్ చైర్మన్ వెంగడ నీలకంఠం అన్నారు. ముంచింగిపుట్టు లో ఆయన మాట్లాడుతూ..పోడు, కొండ, మెట్ట భూములకు సాగునీరు, దిగుబడి తక్కువగా ఉంటాయని తెలిపారు. కుటుంబ వాస్తవ ఆదాయాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని, తిరస్కరించిన దరఖాస్తులను పునఃపరిశీలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ముంచింగిపుట్టు: భూమి కాదు.. ఆదాయమే పెన్షన్‌కు ప్రామాణికం