Sunday, 13 September 2026
  • Home  
  • మానవతా సేవే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు: అల్లూరి విక్రమాదిత్య
- తూర్పు గోదావరి

మానవతా సేవే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు: అల్లూరి విక్రమాదిత్య

తాళ్లపూడి, పున్నమి ప్రతినిధి, జులై 28: మానవత స్వచ్ఛంద సేవా సంస్థ తాళ్లపూడిలో విద్య, వైద్యం తదితర రంగాల్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజానికి విశేష సేవలు అందిస్తోందని అన్నదేవరపేట జమిందార్ అల్లూరి విక్రమాదిత్య కొనియాడారు. సంస్థ మాజీ అధ్యక్షుడు వెలుగుబంటి శ్రీనివాస్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నదేవరపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సంస్థ ఆధ్వర్యంలో స్టీలు కంచాలు పంపిణీ చేశారు. అలాగే “శుభదిన్ భోజన్” కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అల్లూరి విక్రమాదిత్య పాల్గొనగా, సంస్థ అధ్యక్షుడు తైలం పోశారావు, కోశాధికారి హనుమంతరావు, ఈసీ సభ్యుడు మునేశ్వరావు, ఉపాధ్యక్షుడు రాజశేఖర్, పాఠశాల ఇన్‌చార్జి ఉపాధ్యాయుడు శంకర్, ఉపాధ్యాయులు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.