ఆగస్టు 25 పున్నమి ప్రతినిధి
బాసర మండలంలోని రేణుకాపూర్ హనుమాన్ ఆలయ పునర్నిర్మాణానికి రూ.2 లక్షలు విరాళంగా ఇస్తానని ఇచ్చిన మాటను దేశ్ముఖ సంజీవరావు నిలబెట్టుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం రూ.35 వేల విలువైన ఇసుక, రూ.10 వేల విలువైన కంకరను ఆలయ నిర్మాణం కోసం తీసుకువచ్చి ఆలయ కమిటీ సభ్యులకు అప్పగించారు. మిగిలిన మొత్తాన్ని విడతలవారీగా అందజేస్తానని తెలిపారు.
హనుమాన్ భక్తుడైన సంజీవరావు గత 40 ఏళ్లుగా రేణుకాపూర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణానికి తనవంతు సహకారం అందించడం పట్ల కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు ఫ్యాట్ల సుఖేష్‌రావు, బాసర మున్నూరు కాపు అధ్యక్షుడు సీహెచ్ నాగరాజ్, ప్రతాప్‌రావు, రాజేశ్వర్ దేశ్ముఖ్, బాసర మండల బీజేపీ అధ్యక్షుడు పుట్నాల సాయినాథ్, జంగం రాజేందర్, గంగాధర్, సంజీవరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.



