మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాల్లో నడవడమే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అన్నారు.
మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం వద్ద ఉన్న గాంధీ పార్కులో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
స్వాతంత్ర్య సమరంలో గాంధీజీ నాయకత్వం ప్రపంచానికే మార్గదర్శకమని కలెక్టర్ పేర్కొన్నారు.
సత్యం, అహింస, సామరస్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం, పరిశుభ్రత, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే బాపూజీ కలలు కన్న స్వరాజ్యం సాకారమవుతుందని తెలిపారు.
ప్రజలందరూ గాంధేయవాదాన్ని తమ జీవితాల్లో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
Uploaded Video:


