Wednesday, 10 June 2026
  • Home  
  • మల్కాపురంలో మెగా జాబ్ మేళా: భారీగా హాజరు అయిన యువత
- విశాఖపట్నం

మల్కాపురంలో మెగా జాబ్ మేళా: భారీగా హాజరు అయిన యువత

గాజువాక , మల్కాపురం, నవంబర్ (పున్నమి ప్రతినిధి) పారిశ్రామిక ప్రాంత యువతీ–యువకుల ఉపాధి అవకాశాలను విస్తృతం చేయాలనే లక్ష్యంతో మల్కాపురంలో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు భారీ స్పందన లభించింది. ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సారథ్యంలో మరిడిమాంబ కళ్యాణ మండపంలో ఈ జాబ్ మేళా జరిగింది. ఉదయం 7 గంటల నుంచే యువత భారీగా తరలివచ్చి రిజిస్ట్రేషన్ కేంద్రం వద్ద క్యూలు కట్టారు. మొత్తం 25 ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు పాల్గొనగా, ఎస్ఎస్సి నుండి బీటెక్ వరకు వివిధ విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను అందుబాటులో ఉంచారు. పరిశ్రమలు, సేవా రంగ సంస్థలు, టెక్నికల్, నాన్–టెక్నికల్ విభాగాల్లో వందలాది ఉద్యోగ అవకాశాలు ప్రతిపాదించడంతో యువతలో ఉత్సాహం వెల్లివిరిసింది. స్థానిక ప్రాంతంలో ఇంత భారీ స్థాయిలో జాబ్ మేళా జరగడం మొదటిసారి కావడంతో పాల్గొన్న అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు. గణబాబు మాట్లాడుతూ మాట్లాడుతూ యువత నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన ఓటమి ప్రభుత్వము యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు.

గాజువాక , మల్కాపురం, నవంబర్ (పున్నమి ప్రతినిధి)

పారిశ్రామిక ప్రాంత యువతీ–యువకుల ఉపాధి అవకాశాలను విస్తృతం చేయాలనే లక్ష్యంతో మల్కాపురంలో శుక్రవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు భారీ స్పందన లభించింది. ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సారథ్యంలో మరిడిమాంబ కళ్యాణ మండపంలో ఈ జాబ్ మేళా జరిగింది. ఉదయం 7 గంటల నుంచే యువత భారీగా తరలివచ్చి రిజిస్ట్రేషన్ కేంద్రం వద్ద క్యూలు కట్టారు. మొత్తం 25 ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు పాల్గొనగా, ఎస్ఎస్సి నుండి బీటెక్ వరకు వివిధ విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను అందుబాటులో ఉంచారు. పరిశ్రమలు, సేవా రంగ సంస్థలు, టెక్నికల్, నాన్–టెక్నికల్ విభాగాల్లో వందలాది ఉద్యోగ అవకాశాలు ప్రతిపాదించడంతో యువతలో ఉత్సాహం వెల్లివిరిసింది. స్థానిక ప్రాంతంలో ఇంత భారీ స్థాయిలో జాబ్ మేళా జరగడం మొదటిసారి కావడంతో పాల్గొన్న అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు. గణబాబు మాట్లాడుతూ మాట్లాడుతూ యువత నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన ఓటమి ప్రభుత్వము యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.