మర్రిపాడు: స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆత్మకూరు డీఎస్పీ టి.వెంకటేశ్వర్లు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని పలు రికార్డులు, కేసులకు సంబంధించిన ఫైళ్లను పరిశీలించి, పెండింగ్ కేసుల దర్యాప్తు పురోగతిని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్టేషన్‌కు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ, వారికి మెరుగైన పోలీస్ సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణలో అప్రమత్తంగా ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచాలని సూచించారు. రికార్డులను నిబంధనల ప్రకారం నిర్వహిస్తూ, విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డీఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు.

మర్రిపాడు పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ తనిఖీ