Saturday, 19 September 2026
  • Home  
  • మర్రిపాడు కొనసముద్రంలో రాములవారి దేవాలయ నిర్మాణానికి టీడీపీ నాయకులతో భూమి పూజ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మర్రిపాడు కొనసముద్రంలో రాములవారి దేవాలయ నిర్మాణానికి టీడీపీ నాయకులతో భూమి పూజ

నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో, ఆనం రామనారాయణ రెడ్డి చొరవతో ఆత్మకూరు నియోజకవర్గంలో మంజూరైన దేవాలయాల నిర్మాణ కార్యక్రమం కొనసాగుతోంది. మర్రిపాడు మండలం కొనసముద్రం ఎస్సీ కాలనీలో రాములవారి దేవాలయ నిర్మాణానికి శనివారం గ్రామస్తులతో కలిసి టీడీపీ నాయకులు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ కేశవులు చౌదరి, ఆత్మకూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఆరికట్ల జనార్దన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనార్దన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చొరవతో ఆత్మకూరు నియోజకవర్గంలో మొత్తం 23 దేవాలయాలు మంజూరయ్యాయని తెలిపారు. అందులో భాగంగా మర్రిపాడు మండలంలో ఇప్పటివరకు మూడు దేవాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా కొనసముద్రం గ్రామం ఎస్సీ కాలనీలో దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో కాలనీ వాసులంతా మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు దేవరాల గంగాధర్ యాదవ్, టీడీపీ నాయకులు కొన్నమనేని నాగేశ్వరు తదితరులు పాల్గొన్నారు.

నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో, ఆనం రామనారాయణ రెడ్డి చొరవతో ఆత్మకూరు నియోజకవర్గంలో మంజూరైన దేవాలయాల నిర్మాణ కార్యక్రమం కొనసాగుతోంది.
మర్రిపాడు మండలం కొనసముద్రం ఎస్సీ కాలనీలో రాములవారి దేవాలయ నిర్మాణానికి శనివారం గ్రామస్తులతో కలిసి టీడీపీ నాయకులు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్ట్ చైర్మన్ కేశవులు చౌదరి, ఆత్మకూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఆరికట్ల జనార్దన్ నాయుడు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జనార్దన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చొరవతో ఆత్మకూరు నియోజకవర్గంలో మొత్తం 23 దేవాలయాలు మంజూరయ్యాయని తెలిపారు. అందులో భాగంగా మర్రిపాడు మండలంలో ఇప్పటివరకు మూడు దేవాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు.
ఇందులో భాగంగా కొనసముద్రం గ్రామం ఎస్సీ కాలనీలో దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో కాలనీ వాసులంతా మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసినట్లు ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు దేవరాల గంగాధర్ యాదవ్, టీడీపీ నాయకులు కొన్నమనేని నాగేశ్వరు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.