శ్రీ సత్యసాయి జిల్లా ఓడిచెరువు మండలం మద్దకవారిపల్లిలో వినాయక నిమజ్జనోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలు, ఆనందోత్సాహాల మధ్య గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన వినాయక లడ్డూ వేలంపాటలో బొంచెర్వు మోహనప్ప కుమారుడు బొంచెర్వు రమణ రూ.80,116లకు లడ్డూను సొంతం చేసుకున్నారు. వేలంపాట ఉత్సాహంగా సాగగా గ్రామస్థులు ఆసక్తిగా పాల్గొన్నారు. అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నిమజ్జనం అనంతరం భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. గ్రామంలోని యువత, మహిళలు, చిన్నారులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో, ఆనందోత్సాహాలతో పాల్గొనడంతో వినాయక నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

మద్దకవారిపల్లిలో ఘనంగా వినాయక నిమజ్జనం