రఘనాధ పాలేం/ఖమ్మం
రక్షా బంధన్‌ను పురస్కరించుకుని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బ్రహ్మకుమారీలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రఘునాథపాలెం మండల పరిధిలోని జింకలతండ వద్ద స్వామి నారాయణ గురుకుల పాఠశాల శంకుస్థాపన కార్యక్రమానికి బుధవారం మంత్రి తుమ్మల హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీలు ఆయనకు రాఖీ కట్టి ఆశీర్వాదాలు అందించారు. రక్షా బంధన్ సోదర, సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.



