ముస్తాబాద్ ఏప్రిల్ 28 పున్నమి ప్రతినిధి
KCR కప్ – 2026 క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో భాగంగా గౌరవ BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ప్రోత్సాహంతో పోతుగల్, గూడూరు, చికోడ్, చిప్పపల్లి ఎంపీటీసీ జట్లకు కేసీఆర్ కప్ క్రికెట్ కిట్‌లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ మండల BRS పార్టీ అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు పాల్గొని కిట్‌లను అందించారు.
క్రికెట్ కిట్‌లు స్వీకరించిన వారిలో మాజీ ఎంపీటీసీ పడిగే ఆంజనేయులు, నామపూర్ గ్రామ అధ్యక్షులు తాడేపు అనిల్, BRS నాయకులు అమర్, మండల యువ నాయకులు వంగూరి దిలీప్, పోతారం సతీష్, కోడూరి మనీష్ తదితరులు పాల్గొన్నారు. కిట్‌ల పంపిణీ చేసిన కేటీఆర్ గారికి ముస్తాబాద్ మండల పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

