తిరుపతి జిల్లా, రైల్వేకోడూరు మండలం, వీవీ కండ్రికలో ప్రభుత్వ భూములను దళితులు, గిరిజనులకు పంపిణీ చేయాలని, భూకబ్జాలను అరికట్టాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల సాధనకు సెప్టెంబర్ 28న వీవీ కండ్రిక నుంచి కోడూరు తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మంగళవారం వీవీ కండ్రికలో దళితులతో గ్రామసభ నిర్వహించారు. సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ నాయకుడు సీహెచ్ చంద్రశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి జనార్ధన్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకటేశ్వర్లు, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు పందికాళ్ల మణి మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను అరికట్టి, వాటిని అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని కోరారు. భూకబ్జాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలోనూ ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఉద్యమాలు నిర్వహించినట్లు గుర్తుచేశారు. దళితుల ఆత్మగౌరవం, భూమి హక్కుల కోసం చేపట్టనున్న పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బొజ్జ శివయ్య, నగిరిపాటి ఆనంద్, నాగేశ్వరయ్య తదితరులతో పాటు పలువురు దళితులు పాల్గొన్నారు.

భూకబ్జాలు అరికట్టాలని సెప్టెంబర్ 28న పాదయాత్ర