శ్రీ కాళహస్తి, జూన్ 19, (పున్నమి న్యూస్) : కూటమి ప్రభుత్వం రెండేళ్ల ప్రజా పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ‘కూటమి విజయోత్సవ సభ’ ఘన విజయాన్ని సాధించింది. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, ప్రజలు భారీగా హాజరై సభను విజయవంతం చేశారు. ఈ సభలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డితో పాటు తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు, టీటీడీ బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి, తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్ర, జిల్లా, పార్లమెంట్, నియోజకవర్గ స్థాయి కూటమి నాయకులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని తెలిపారు. శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. సభను విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం మొత్తం ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.

భారీ జనసందోహం మధ్య కూటమి విజయోత్సవ సభ