బైక్ ప్రమాదంలో గాయపడిన వైసీపీ నాయకుడు లక్కు నరసింహారెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి
నెల్లూరు నగరంలోని 3వ డివిజన్ ప్రశాంతి నగర్లో ఇటీవల బైక్ ప్రమాదంలో గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న వైసీపీ నాయకుడు లక్కు నరసింహారెడ్డిని వైఎస్ఆర్సిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. డివిజన్ ఇన్చార్జ్ అక్కలరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఆయన నరసింహారెడ్డి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని మళ్లీ ప్రజా సేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

బైక్ ప్రమాదంలో గాయపడిన వైసీపీ నాయకుడు లక్కు నరసింహారెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి
బైక్ ప్రమాదంలో గాయపడిన వైసీపీ నాయకుడు లక్కు నరసింహారెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి నెల్లూరు నగరంలోని 3వ డివిజన్ ప్రశాంతి నగర్లో ఇటీవల బైక్ ప్రమాదంలో గాయపడి విశ్రాంతి తీసుకుంటున్న వైసీపీ నాయకుడు లక్కు నరసింహారెడ్డిని వైఎస్ఆర్సిపి నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. డివిజన్ ఇన్చార్జ్ అక్కలరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ఆయన నరసింహారెడ్డి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని మళ్లీ ప్రజా సేవలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

