వేల్పుల సచివాలయంలో ఆకస్మిక తనిఖీ
పున్నమి న్యూస్ ప్రతినిధి
(సెప్టెంబర్ 22):
వేల్పుల: గ్రామ సచివాలయాన్ని అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు.
అనంతరం గ్రామ ప్రజలకు బిన్ బ్యాగ్ వినియోగం, తడి–పొడి చెత్తను వేర్వేరుగా అందించడం, స్వచ్ఛ రథం ద్వారా చెత్త సేకరణపై అవగాహన కల్పించారు. ప్రతి కుటుంబం తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు చెత్తను సక్రమంగా వేరు చేసి స్వచ్ఛ రథం సిబ్బందికి అందించాలని సూచించారు.
గ్రామాన్ని పరిశుభ్రంగా, స్వచ్ఛంగా ఉంచేందుకు ప్రజలందరూ భాగస్వాములు కావాలని అధికారులు కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.






