ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్ట్ 10 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలో పోర్టు రోడ్డు బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బొజ్జ వినయ్ కుమార్ యాదవ్ మనుబోలు నుంచి చెముడుగుంటకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, బ్రిడ్జిపై అకస్మాత్తుగా బిక్షాటన చేస్తున్న మహిళ ఎదురుపడింది. ఆమెను తప్పించబోయే క్రమంలో బైక్ అదుపుతప్పి స్కిడ్ అయి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో వినయ్ కుమార్ యాదవ్ ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో కొద్దిసేపు బ్రిడ్జిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

బిక్షాటన చేస్తున్న మహిళను తప్పించబోయి బైక్ స్కిడ్.. యువకుడికి గాయాలు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్ట్ 10 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలో పోర్టు రోడ్డు బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బొజ్జ వినయ్ కుమార్ యాదవ్ మనుబోలు నుంచి చెముడుగుంటకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, బ్రిడ్జిపై అకస్మాత్తుగా బిక్షాటన చేస్తున్న మహిళ ఎదురుపడింది. ఆమెను తప్పించబోయే క్రమంలో బైక్ అదుపుతప్పి స్కిడ్ అయి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో వినయ్ కుమార్ యాదవ్ ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి అతడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో కొద్దిసేపు బ్రిడ్జిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

