Sunday, 27 September 2026
  • Home  
  • ఉచిత ఫ్రీజర్‌ బాక్సులతో బాధిత కుటుంబాలకు చేయూత
- తిరుపతి

ఉచిత ఫ్రీజర్‌ బాక్సులతో బాధిత కుటుంబాలకు చేయూత

మనిషి జీవిత ప్రయాణంలో సుఖదుఃఖాలు సహజం. అయితే ఆప్తుడిని కోల్పోయిన కుటుంబానికి ఆ విషాదం తీరని లోటుగా మిగులుతుంది. అలాంటి క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు తనవంతు సహాయాన్ని అందిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు చిట్టమూరు మండలానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యులు పిల్లిమేటి రమేష్‌. సేవా భావంతో ఏర్పాటు చేసిన పిల్లిమేటి సుమ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. చివరి మజిలీలో ఉచిత ఫ్రీజర్‌ బాక్సుల సేవ మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉండే సమయంలో వారికి అవసరమైన సహాయం అందించాలనే ఉద్దేశంతో ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్‌ బాక్సుల సేవను అందుబాటులోకి తీసుకొచ్చారు. చిట్టమూరు మండలం, పరిసర గ్రామాల్లో ఎవరైనా మృతి చెందిన సందర్భంలో బాధిత కుటుంబాల నుంచి ఎలాంటి రుసుము తీసుకోకుండా అవసరమైన సమయంలో ఫ్రీజర్‌ బాక్సులను ఉచితంగా అందిస్తున్నారు. ఆప్తుడిని కోల్పోయి కన్నీరుమున్నీరుగా ఉన్న కుటుంబానికి ఆ సమయంలో అందే చిన్నపాటి సహాయం కూడా ఎంతో విలువైనదిగా మారుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన పిల్లిమేటి రమేష్‌.. అవసరమైన కుటుంబాలకు వీలైనంత త్వరగా ఫ్రీజర్‌ బాక్సులను అందిస్తూ వారికి కొంత ఊరటనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రచారానికి దూరంగా.. సేవే లక్ష్యంగా సేవా కార్యక్రమాలను ప్రచారం కోసం కాకుండా సామాజిక బాధ్యతగా నిర్వహించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్లు ట్రస్ట్‌ నిర్వాహకులు చెబుతున్నారు. తాను సంపాదించిన దానిలో కొంత భాగాన్ని సమాజానికి ఉపయోగపడేలా చేయాలనే ఆలోచనతో పిల్లిమేటి రమేష్‌ ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. మనకున్న దానిలో కొంతైనా అవసరంలో ఉన్నవారికి ఉపయోగపడితే అదే నిజమైన సేవ’ అనే భావనతో ప్రజలకు అండగా నిలుస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించడం, ఆపదలో ఉన్న కుటుంబాలకు చేయూత అందించడం వంటి కార్యక్రమాలను తన పరిధిలో కొనసాగిస్తున్నారు. పేదలకు వైద్య సేవలు ఫ్రీజర్‌ బాక్సుల సేవతో పాటు చిట్టమూరు మండలం, పరిసర ప్రాంత గ్రామాల్లో అవసరమైన ప్రజలకు తనవంతు సహాయాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాల్లో పేదలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన వారికి వైద్య సలహాలు, ప్రాథమిక వైద్య సేవలు అందించేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య సేవలు పొందలేని పేదలకు ఇటువంటి శిబిరాలు ఉపయోగకరంగా ఉంటున్నాయి.

మనిషి జీవిత ప్రయాణంలో సుఖదుఃఖాలు సహజం. అయితే ఆప్తుడిని కోల్పోయిన కుటుంబానికి ఆ విషాదం తీరని లోటుగా మిగులుతుంది.
అలాంటి క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు తనవంతు సహాయాన్ని అందిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు చిట్టమూరు మండలానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యులు పిల్లిమేటి రమేష్‌.
సేవా భావంతో ఏర్పాటు చేసిన పిల్లిమేటి సుమ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
చివరి మజిలీలో ఉచిత ఫ్రీజర్‌ బాక్సుల సేవ
మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉండే సమయంలో వారికి అవసరమైన సహాయం అందించాలనే ఉద్దేశంతో ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్‌ బాక్సుల సేవను అందుబాటులోకి తీసుకొచ్చారు.
చిట్టమూరు మండలం, పరిసర గ్రామాల్లో ఎవరైనా మృతి చెందిన సందర్భంలో బాధిత కుటుంబాల నుంచి ఎలాంటి రుసుము తీసుకోకుండా అవసరమైన సమయంలో ఫ్రీజర్‌ బాక్సులను ఉచితంగా అందిస్తున్నారు.
ఆప్తుడిని కోల్పోయి కన్నీరుమున్నీరుగా ఉన్న కుటుంబానికి ఆ సమయంలో అందే చిన్నపాటి సహాయం కూడా ఎంతో విలువైనదిగా మారుతుంది.
ఈ విషయాన్ని గుర్తించిన పిల్లిమేటి రమేష్‌.. అవసరమైన కుటుంబాలకు వీలైనంత త్వరగా ఫ్రీజర్‌ బాక్సులను అందిస్తూ వారికి కొంత ఊరటనిచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రచారానికి దూరంగా.. సేవే లక్ష్యంగా
సేవా కార్యక్రమాలను ప్రచారం కోసం కాకుండా సామాజిక బాధ్యతగా నిర్వహించాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నట్లు ట్రస్ట్‌ నిర్వాహకులు చెబుతున్నారు.
తాను సంపాదించిన దానిలో కొంత భాగాన్ని సమాజానికి ఉపయోగపడేలా చేయాలనే ఆలోచనతో పిల్లిమేటి రమేష్‌ ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
మనకున్న దానిలో కొంతైనా అవసరంలో ఉన్నవారికి ఉపయోగపడితే అదే నిజమైన సేవ’ అనే భావనతో ప్రజలకు అండగా నిలుస్తున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో స్పందించడం, ఆపదలో ఉన్న కుటుంబాలకు చేయూత అందించడం వంటి కార్యక్రమాలను తన పరిధిలో కొనసాగిస్తున్నారు.
పేదలకు వైద్య సేవలు
ఫ్రీజర్‌ బాక్సుల సేవతో పాటు చిట్టమూరు మండలం, పరిసర ప్రాంత గ్రామాల్లో అవసరమైన ప్రజలకు తనవంతు సహాయాన్ని అందిస్తున్నారు.
ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాల్లో పేదలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తూ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన వారికి వైద్య సలహాలు, ప్రాథమిక వైద్య సేవలు అందించేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్య సేవలు పొందలేని పేదలకు ఇటువంటి శిబిరాలు ఉపయోగకరంగా ఉంటున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.