Wednesday, 12 August 2026
  • Home  
  • బాల్కొండ అభివృద్ధికి కొత్త నిర్వచనం –వేముల ప్రశాంత్ రెడ్డి
- నిజామాబాద్

బాల్కొండ అభివృద్ధికి కొత్త నిర్వచనం –వేముల ప్రశాంత్ రెడ్డి

బాల్కొండ నియోజకవర్గానికి గతంలో ఎంతోమంది హేమాహేమీలైన నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచి పదవులు అనుభవించారు. కానీ బాల్కొండ నియోజకవర్గం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందిందా? ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందా? అనే ప్రశ్నలకు ప్రజలే సమాధానం చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజా జీవితంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ప్రశాంత్ రెడ్డి తనవంతు పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగారు. అనంతరం బాల్కొండ ప్రజలు తనపై నమ్మకం ఉంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన బాధ్యతగా భావించి ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు. బాల్కొండ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన నాయకుడిగా ప్రశాంత్ రెడ్డి ప్రజల మధ్య నిలిచారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రహదారులు, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, సంక్షేమం వంటి అనేక రంగాల్లో అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. పదవి అనేది కేవలం అధికారం అనుభవించడానికి కాదు.. ప్రజలకు సేవ చేయడానికి, వారి సమస్యలను పరిష్కరించడానికి ఒక బాధ్యత అనే ఆలోచనతో పనిచేసిన నాయకుడు ప్రశాంత్ రెడ్డి. ప్రజల కోసం పనిచేసిన నాయకుడిపై రాజకీయ విమర్శలు చేయడం ఎవరికైనా సహజమే. కానీ నిజాలు తెలుసుకోకుండా అవాకులు, చెవాకులు మాట్లాడటం మాత్రం సరైంది కాదు. విమర్శలు చేయాలంటే ఆధారాలతో మాట్లాడాలి. బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరు ఎంత పనిచేశారో ప్రజలకు తెలుసు. ప్రశాంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం, ఆయన చేసిన అభివృద్ధి పనులు, ప్రజల కోసం చేసిన కృషిని బాల్కొండ ప్రజలు స్వయంగా చూశారు. అందుకే వ్యక్తిగత విమర్శలకు కాకుండా అభివృద్ధి, ప్రజా సంక్షేమం, చేసిన పనులపై చర్చ జరగాలి. ప్రశాంత్ రెడ్డి గురించి అవాకులు, చెవాకులు మాట్లాడటం మానుకోండి. ప్రజల మధ్యకు వెళ్లి వాస్తవాలను తెలుసుకోండి. అభివృద్ధి గురించి మాట్లాడండి… ఆధారాలతో మాట్లాడండి. బాల్కొండ ప్రజల కోసం నిలబడిన నాయకుడిని ప్రజలే నిర్ణయిస్తారు.

బాల్కొండ నియోజకవర్గానికి గతంలో ఎంతోమంది హేమాహేమీలైన నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచి పదవులు అనుభవించారు. కానీ బాల్కొండ నియోజకవర్గం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందిందా? ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించిందా? అనే ప్రశ్నలకు ప్రజలే సమాధానం చెప్పాలి.
అలాంటి పరిస్థితుల్లో ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజా జీవితంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు ప్రశాంత్ రెడ్డి.
తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ప్రశాంత్ రెడ్డి తనవంతు పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో ఉద్యమ స్ఫూర్తితో ముందుకు సాగారు.
అనంతరం బాల్కొండ ప్రజలు తనపై నమ్మకం ఉంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన బాధ్యతగా భావించి ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు.
బాల్కొండ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన నాయకుడిగా ప్రశాంత్ రెడ్డి ప్రజల మధ్య నిలిచారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, రహదారులు, సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, సంక్షేమం వంటి అనేక రంగాల్లో అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు.
పదవి అనేది కేవలం అధికారం అనుభవించడానికి కాదు..
ప్రజలకు సేవ చేయడానికి, వారి సమస్యలను పరిష్కరించడానికి ఒక బాధ్యత అనే ఆలోచనతో పనిచేసిన నాయకుడు ప్రశాంత్ రెడ్డి.
ప్రజల కోసం పనిచేసిన నాయకుడిపై రాజకీయ విమర్శలు చేయడం ఎవరికైనా సహజమే. కానీ నిజాలు తెలుసుకోకుండా అవాకులు, చెవాకులు మాట్లాడటం మాత్రం సరైంది కాదు. విమర్శలు చేయాలంటే ఆధారాలతో మాట్లాడాలి. బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరు ఎంత పనిచేశారో ప్రజలకు తెలుసు.
ప్రశాంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం, ఆయన చేసిన అభివృద్ధి పనులు, ప్రజల కోసం చేసిన కృషిని బాల్కొండ ప్రజలు స్వయంగా చూశారు. అందుకే వ్యక్తిగత విమర్శలకు కాకుండా అభివృద్ధి, ప్రజా సంక్షేమం, చేసిన పనులపై చర్చ జరగాలి.
ప్రశాంత్ రెడ్డి గురించి అవాకులు, చెవాకులు మాట్లాడటం మానుకోండి.
ప్రజల మధ్యకు వెళ్లి వాస్తవాలను తెలుసుకోండి.
అభివృద్ధి గురించి మాట్లాడండి… ఆధారాలతో మాట్లాడండి.
బాల్కొండ ప్రజల కోసం నిలబడిన నాయకుడిని ప్రజలే నిర్ణయిస్తారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.