డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ), ఐ ఎల్ టి డి అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ సారథ్యంలో ఫ్రూట్స్, స్వీట్లు, దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్నాల విజయ్ కుమార్ మాట్లాడుతూ, అంబేద్కర్ జయంతి రోజునే బహుజన్ సమాజ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం గర్వకారణమని తెలిపారు.
డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనకే బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పడిందని, ఆయన చూపిన మార్గంలోనే పార్టీ ముందుకు సాగుతుందని అన్నారు. భారత రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను యువత తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజంలో సమానత్వం, న్యాయం సాధించడానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ రాజేష్ కుమార్, కొండపల్లి సూరిబాబు, అంగడి వంశీ, కొత్తపల్లి శేఖర్, నెల్లి సుబ్బారావు, సుధీర్, మోకాను బాల, కె విస్సు, కళ్యాణ్, పల్లవి తదితరులు, అంబేద్కర్ యూత్, ఏపీ పని యూత్ సభ్యులు పాల్గొన్నారు.

బహుజన్ సమాజ్ పార్టీ : అంబేద్కర్ 135వ జయంతోత్సవాలు
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ), ఐ ఎల్ టి డి అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ సారథ్యంలో ఫ్రూట్స్, స్వీట్లు, దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్నాల విజయ్ కుమార్ మాట్లాడుతూ, అంబేద్కర్ జయంతి రోజునే బహుజన్ సమాజ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం గర్వకారణమని తెలిపారు. డాక్టర్ అంబేద్కర్ ఆశయ సాధనకే బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పడిందని, ఆయన చూపిన మార్గంలోనే పార్టీ ముందుకు సాగుతుందని అన్నారు. భారత రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను యువత తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజంలో సమానత్వం, న్యాయం సాధించడానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ రాజేష్ కుమార్, కొండపల్లి సూరిబాబు, అంగడి వంశీ, కొత్తపల్లి శేఖర్, నెల్లి సుబ్బారావు, సుధీర్, మోకాను బాల, కె విస్సు, కళ్యాణ్, పల్లవి తదితరులు, అంబేద్కర్ యూత్, ఏపీ పని యూత్ సభ్యులు పాల్గొన్నారు.

