ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 12 ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం వీరంపల్లి పంచాయతీ లింగారెడ్డిపల్లిలో రైతులు ఫార్మర్ ఐడీలను తక్షణమే నమోదు చేసుకోవాలని వీఏఏ శ్రీవిజిత సూచించారు. రైతుల చేత ఆమె ఫార్మర్ ఐడీలను క్రియేట్ చేయించారు. మొబైల్ ఫోన్ ద్వారా సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఫార్మర్ ఐడీ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ ఆర్థిక సహాయ, రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తుల విక్రయానికి కూడా ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. రైతులందరూ ఆలస్యం చేయకుండా ఫార్మర్ ఐడీ నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రసాద్, రఘురామయ్య, బోనుబోయిన సురేంద్ర, బోనుబోయిన మధు, నాగరాజు, రామయ్య, వెంకట రమణయ్య, రవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫార్మర్ ఐడీ నమోదు చేసుకోవాలి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 12 ( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం వీరంపల్లి పంచాయతీ లింగారెడ్డిపల్లిలో రైతులు ఫార్మర్ ఐడీలను తక్షణమే నమోదు చేసుకోవాలని వీఏఏ శ్రీవిజిత సూచించారు. రైతుల చేత ఆమె ఫార్మర్ ఐడీలను క్రియేట్ చేయించారు. మొబైల్ ఫోన్ ద్వారా సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఫార్మర్ ఐడీ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ ఆర్థిక సహాయ, రాయితీ పథకాలను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తుల విక్రయానికి కూడా ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. రైతులందరూ ఆలస్యం చేయకుండా ఫార్మర్ ఐడీ నమోదు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రసాద్, రఘురామయ్య, బోనుబోయిన సురేంద్ర, బోనుబోయిన మధు, నాగరాజు, రామయ్య, వెంకట రమణయ్య, రవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

