రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదలకు ముందే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక ప్రీమియర్ షోలకు అనుమతి లభించడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌పై భారీ ఆసక్తి కనిపిస్తోంది.
టికెట్ ధరల పెంపు అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేయగా, సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన పోస్టర్లు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.


