పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆగస్టు 11)
వేముల: ప్రజల వద్దకే పరిపాలన.. ప్రజలే దేవుళ్లు అనే సంకల్పంతో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా పాలన కొనసాగిస్తున్నారని పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బి.టెక్ రవి) పేర్కొన్నారు.
వేముల మండలం గుండ్లపల్లె గ్రామంలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో భాగంగా టీడీపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథిరెడ్డితో కలిసి ఆయన ఇంటింటికీ తిరిగి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడం, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడటమే ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నాయకులు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తుంగభద్ర హై లెవెల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి, పేర్ల శేషారెడ్డి, మబ్బుచింతలపల్లి శ్రీనాథ్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బ్రహ్మయ్య తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




