సత్తుపల్లి / ఖమ్మం
సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను కలుసుకున్నారు.
6వ వార్డులో కౌన్సిలర్ తోట సుజల రాణి ఆధ్వర్యంలో జరిగిన శుభకార్యక్రమాలు, పరామర్శల్లో పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపి, బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు.
7వ వార్డు రాజీవ్ కాలనీలో కౌన్సిలర్ షరీఫ్ నసీమ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మహిళలకు చీరలు అందజేశారు.
17వ వార్డు కిరణ్ మార్చంట్‌లో కాంగ్రెస్ నాయకుడు చవ్వ మధు మనవడు, చవ్వ సన్నీ కుమారుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు. ప్రజల సుఖదుఃఖాల్లో భాగస్వామిగా ఉంటానని తెలిపారు.



