సిద్ధవటంలోని స్థానిక 6,8 అంగన్వాడీ కేంద్రాల్లో ‘పోషణ మాసం-2026..మన అంగన్వాడీ–మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కడప అర్బన్ సీడీపీవో ఎం. సుగుణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సూపర్వైజర్లు దీప, శ్రీవిద్య పాల్గొని పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ, ఆహార వైవిధ్యంపై అవగాహన కల్పించారు. గర్భిణులు, బాలింతలు చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, ఆకుకూరలు, పండ్లు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచించారు. ఆరేళ్లలోపు పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పోషకాహారం ఎంతో అవసరమని తెలిపారు. కార్యక్రమంలో తల్లులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.


