Tuesday, 29 September 2026
  • Home  
  • పెదబయలు: 15 కి.మీటర్ల రహదారికి తారు రోడ్డు మంజూరు చేయాలి: బీజేపీ
- అల్లూరి సీతారామరాజు

పెదబయలు: 15 కి.మీటర్ల రహదారికి తారు రోడ్డు మంజూరు చేయాలి: బీజేపీ

పెదబయలు: మండలంలోని గుత్తులపుట్టు సంతబయలు–పెదకోడపల్లి–బంట్రోతుపుట్టు–కించూరు–కిముడుపల్లి రహదారికి నూతన తారు రోడ్డు నిర్మాణానికి తక్షణమే నిధులు మంజూరు చేయాలని అల్లూరి జిల్లా బీజేపీ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సుమారు 15 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రహదారిని 15 ఏళ్ల క్రితం నిర్మించగా, నిర్వహణ లేక ప్రస్తుతం అధ్వానంగా మారిందన్నారు. రహదారి గుంతలమయంగా మారడంతో పలు పంచాయతీల ప్రజలు, విద్యార్థులు, రైతులు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షాకాలంలో సమస్య మరింత తీవ్రంగా మారుతోందని పేర్కొన్నారు. నూతన తారు రోడ్డు నిర్మిస్తే రవాణా సౌకర్యం మెరుగుపడి, గ్రామాల అభివృద్ధికి దోహదపడుతుందని నాయకులు తెలిపారు. బీజేపీ అల్లూరి జిల్లా అధ్యక్షురాలు మఠం శాంతికుమారి, పెదబయలు నాయకులు లకే భాస్కరరావు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.