పెదపూడి, సెప్టెంబర్ 18 (పున్నమి ప్రతినిధి): పెదపూడి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ పేపకాయల రామచంద్రరావు అకాల మరణానికి సంతాపం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే, ఎంపీటీసీ సభ్యులు, కూటమి నాయకులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.
అనంతరం సెప్టెంబర్ 23తో పదవీకాలం పూర్తికానున్న పెదపూడి మండల ఎంపీపీ కేత తులసి, ఎంపీటీసీ సభ్యులను ఎమ్మెల్యే నల్లమిల్లి సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సేవలందించిన వారి సేవలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్, కాకినాడ డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్, అనపర్తి నియోజకవర్గ, పెదపూడి మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




