వార్త ముఖ్యాంశాలు
- రంగనాయకులపేటలోని పినాకిని పార్కు అభివృద్ధి పనులను నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ.
- నందన్ మంగళవారం పరిశీలించారు.
- మంత్రి నారాయణ ఆదేశాల మేరకు అర్బన్ చాలెంజ్ ఫండ్ నిధులతో రివర్ బండ్ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
రంగనాయకులపేటలోని పినాకిని పార్కు అభివృద్ధి పనులను నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ మంగళవారం పరిశీలించారు. మంత్రి నారాయణ ఆదేశాల మేరకు అర్బన్ చాలెంజ్ ఫండ్ నిధులతో రివర్ బండ్ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికకు నిధుల ఆమోదం లభించిందన్నారు. నదీజలాలకు ఎలాంటి హాని కలగకుండా ముందస్తు జాగ్రత్తలతో నిర్మాణ పనులు చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో నదీతీరం వెంట రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. పార్కు అభివృద్ధితో పెన్నా నదీతీరం మరింత శోభాయమానంగా మారనుందన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ దినేష్, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్