వార్త ముఖ్యాంశాలు
- రామాపురం: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో మంగళవారం నిర్వహించిన ‘పల్లె పండుగ–3.0’ ప్రారంభోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది.
- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
- ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో కలిసి వారికి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.
రామాపురం: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంలో మంగళవారం నిర్వహించిన ‘పల్లె పండుగ–3.0’ ప్రారంభోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో కలిసి వారికి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. పల్లె పండుగ ద్వారా రూ.12 వేల కోట్లతో గ్రామాల్లో మౌలిక వసతులు, సమగ్రాభివృద్ధికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. అనంతరం ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలిసి కోవూరు నియోజకవర్గంలోని గ్రామీణ రహదారుల పునర్నిర్మాణానికి రూ.56.20 కోట్లు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధితో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పల్లె పండుగ కార్యక్రమం గ్రామీణాభివృద్ధికి మరింత ఊతమిస్తుందని పేర్కొన్నారు.