Sunday, 27 September 2026
  • Home  
  • పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలు స్ఫూర్తిదాయకం: అందె రామయ్య
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలు స్ఫూర్తిదాయకం: అందె రామయ్య

దుత్తలూరు: భారతీయ జనసంఘ్ మహానేత, ఏకాత్మ మానవతావాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా బీజేపీ దుత్తలూరు మండల ప్రధాన కార్యదర్శి అందె రామయ్య ఘన నివాళులు అర్పించారు. దేశంలోని చివరి వరుసలో ఉన్న ప్రతి ఒక్కరి అభ్యున్నతినే లక్ష్యంగా చేసుకుని, సమాజ సేవను దేశ సేవగా భావించిన ఆయన ఆలోచనలు నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అంత్యోదయమే లక్ష్యంగా ఆయన చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దేశ సమగ్రత, సామాజిక అభ్యున్నతి కోసం ప్రజలందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.