Saturday, 25 April 2026
  • Home  
  • నేడు టీడీపీ జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం – శ్రీకాళహస్తి నేతలకు కీలక పదవులు
- తిరుపతి

నేడు టీడీపీ జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం – శ్రీకాళహస్తి నేతలకు కీలక పదవులు

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 25 (పున్నమి న్యూస్( : తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ జిల్లా కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం తిరుపతిలో నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన పలువురు పార్టీ నాయకులు జిల్లా కార్యవర్గంలో కీలక పదవులకు నియమితులయ్యారు. జిల్లా ఉపాధ్యక్షులుగా రంగినేని చెంచయ్య నాయుడు, లోకేశ్వరి, జిల్లా అధికార ప్రతినిధిగా వి. అనిత, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా గాలి కృష్ణవేణి, జిల్లా కార్యదర్శిగా ఎం. వెంకటసుబ్బయ్య నియమితులయ్యారు. వీరు రేపు జరిగే కార్యక్రమంలో పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతిలోని రామతులసి కళ్యాణ మండపంలో చింతలచేను రోడ్, ఆర్టీసీ సెంట్రల్ బస్టాండ్ ఎదురుగా నిర్వహించబడనుంది. తిరుపతి పార్లమెంట్ జిల్లా పరిధిలోని రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పనబాక లక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి సంయుక్తంగా ఆహ్వానం తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.