Friday, 22 May 2026
  • Home  
  • నాన్ టీచింగ్ సిబ్బందికి పదోన్నతులపై హర్షం
- తిరుపతి

నాన్ టీచింగ్ సిబ్బందికి పదోన్నతులపై హర్షం

శ్రీ కాళహస్తి, మే 22, (పున్నమి న్యూస్): ఇంటర్మీడియట్ విద్యాశాఖ నాన్ టీచింగ్ విభాగంలో అటెండర్లకు రికార్డు అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించడం పట్ల ఉమ్మడి చిత్తూరు జిల్లా నాన్ టీచింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కందాటి విశ్వేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పదోన్నతులు కల్పించిన ఇంటర్మీడియట్ కమిషనర్ రంజిత్ భాష, కడప ఆర్జేడీ సురేష్ బాబులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పదోన్నతులు పొందిన వెంకటాచలపతి, వెంకట సిద్ధులు, కీర్తికుమార్, పద్మావతి, సుజాత, ద్రాక్షాయని, వెంకటరమణ, భానుచందర్ తదితరులతో కలిసి విశ్వేశ్వర్ రెడ్డి కడప ఆర్జేడీ కార్యాలయాన్ని సందర్శించి అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..జూనియర్ లెక్చరర్ల ప్రమోషన్లలో కూడా నాన్ టీచింగ్ సిబ్బందికి 10 శాతం కోటా కేటాయించాలని ఉన్నతాధికారులను కోరినట్లు వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.