తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం, దొరవారిసత్రం మండలంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన ముందస్తు వేడుకల సందర్భంగా భారీ మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జనసేన నాయకుడు ఏంబేటి ప్రవీణ్ ఆధ్వర్యంలో ‘నోవా బ్లడ్ బ్యాంక్’ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నాయకుడు షేక్ మాభాష హాజరై శిబిరాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా షేక్ మాభాష మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తితో రక్తం అందక ఒక్క ప్రాణం కూడా పోకూడదు” అన్న మాటలను ఆదర్శంగా తీసుకొని ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దానాలన్నింటిలోకెల్లా రక్తదానం అత్యంత పవిత్రమైనదని, రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి మనం ఇచ్చే రక్తం పునర్జన్మను ఇస్తుందన్నారు. సమాజ సేవలో జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులు ఎల్లప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు.
ఈ ప్రాణదాన కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ప్రతీ ఒక్క రక్తదాతకూ ఆయన పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆవుల దాస్, వీర మహిళ సుజాత, కళ్యాణ్, సనత్ కుమార్,దొడ్డి శరత్ కుమార్, డమయి కార్తీక్ ఎలింబెటి ఉదయ్ రాజ్, దినేష్, అఖిల్ మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

దొరవారిసత్రంలో పవన్ కళ్యాణ్ జన్మదిన ముందస్తు వేడుకలు: ఘనంగా మెగా రక్తదాన శిబిరం
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం, దొరవారిసత్రం మండలంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన ముందస్తు వేడుకల సందర్భంగా భారీ మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. జనసేన నాయకుడు ఏంబేటి ప్రవీణ్ ఆధ్వర్యంలో ‘నోవా బ్లడ్ బ్యాంక్’ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నాయకుడు షేక్ మాభాష హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా షేక్ మాభాష మాట్లాడుతూ.. “పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తితో రక్తం అందక ఒక్క ప్రాణం కూడా పోకూడదు” అన్న మాటలను ఆదర్శంగా తీసుకొని ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దానాలన్నింటిలోకెల్లా రక్తదానం అత్యంత పవిత్రమైనదని, రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి మనం ఇచ్చే రక్తం పునర్జన్మను ఇస్తుందన్నారు. సమాజ సేవలో జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులు ఎల్లప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు. ఈ ప్రాణదాన కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ప్రతీ ఒక్క రక్తదాతకూ ఆయన పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆవుల దాస్, వీర మహిళ సుజాత, కళ్యాణ్, సనత్ కుమార్,దొడ్డి శరత్ కుమార్, డమయి కార్తీక్ ఎలింబెటి ఉదయ్ రాజ్, దినేష్, అఖిల్ మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

