దేశంలోని పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న తీవ్ర ఉష్ణోగ్రతలు, వేడిగాలుల పరిస్థితులపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని బందా ప్రాంతంలో 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవడం, పలు రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ట్రైబ్యునల్ ఈ నిర్ణయం తీసుకుంది. వేడిగాలులు ఆరోగ్యం, విద్య, ఉపాధి రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది.
ప్రాంతాల వారీగా ప్రత్యేక వ్యూహాలు రూపొందించి ప్రజలను రక్షించే చర్యలు చేపట్టాలని ఎన్‌జీటీ సూచించింది.


