Wednesday, 15 July 2026
  • Home  
  • అనపర్తి మండలం రామవరంలో అమరావతి చాంపియన్షిప్–2026 గోడపత్రిక ఆవిష్కరణ
- తూర్పు గోదావరి

అనపర్తి మండలం రామవరంలో అమరావతి చాంపియన్షిప్–2026 గోడపత్రిక ఆవిష్కరణ

అనపర్తి, జూలై 15 ( పున్నమి న్యూస్ ): అనపర్తి మండలం రామవరం గ్రామంలో జూలై 23, 24, 25 తేదీలలో అనపర్తిలో నిర్వహించనున్న “అమరావతి చాంపియన్షిప్–2026” సెలక్షన్స్ సందర్భంగా గోడపత్రికను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీడీఓ రామకృష్ణారెడ్డి, కూటమి నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, యువత తమ క్రీడా ప్రతిభను చాటుకునేందుకు అమరావతి చాంపియన్షిప్ మంచి వేదిక అని పేర్కొన్నారు. అర్హత కలిగిన క్రీడాకారులు అధిక సంఖ్యలో ఈ సెలక్షన్స్‌లో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి పోటీలను నిర్వహిస్తోందని, గ్రామీణ ప్రాంత క్రీడాకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు, యువత తదితరులు పాల్గొన్నారు.

అనపర్తి, జూలై 15 ( పున్నమి న్యూస్ ): అనపర్తి మండలం రామవరం గ్రామంలో జూలై 23, 24, 25 తేదీలలో అనపర్తిలో నిర్వహించనున్న “అమరావతి చాంపియన్షిప్–2026” సెలక్షన్స్ సందర్భంగా గోడపత్రికను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీడీఓ రామకృష్ణారెడ్డి, కూటమి నాయకులు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, యువత తమ క్రీడా ప్రతిభను చాటుకునేందుకు అమరావతి చాంపియన్షిప్ మంచి వేదిక అని పేర్కొన్నారు. అర్హత కలిగిన క్రీడాకారులు అధిక సంఖ్యలో ఈ సెలక్షన్స్‌లో పాల్గొని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ యువతలోని ప్రతిభను వెలికితీసేందుకు ఇటువంటి పోటీలను నిర్వహిస్తోందని, గ్రామీణ ప్రాంత క్రీడాకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు, యువత తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.