తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి పువ్వాడ
ఖమ్మం:
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం పొందేందుకు భక్తులు ఉపవాస దీక్షలు, ప్రత్యేక పూజలు, భజనలు నిర్వహిస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ పవిత్ర దినాన్ని జరుపుకుంటారని అన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి, ఆనందం వెల్లివిరియాలని, రాష్ట్ర ప్రజలందరిపై శ్రీమన్నారాయణుని అపార కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆకాంక్షించారు.


