తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
Sep 25, 2026,
తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. నేడు ఈ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
ఆంధ్రప్రదేశ్ : తీవ్ర వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎన్‌టీఆర్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెప్టెంబర్ 25న సెలవు ప్రకటించారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని విద్యాసంస్థలు సెలవును తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచించారు. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.


