Monday, 28 September 2026
  • Home  
  • డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమలో మండల పరిషత్‌లకు ప్రత్యేక అధికారుల పాలన
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమలో మండల పరిషత్‌లకు ప్రత్యేక అధికారుల పాలన

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మండల పరిషత్ పాలకవర్గాల గడువు ముగియడంతో గురువారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమల్లోకి వచ్చింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రత్యేక అధికారులు బాధ్యతలు నిర్వహించనున్నారు. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలన కొనసాగుతోంది. శుక్రవారం నుంచి జిల్లా పరిషత్ పాలన కూడా ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో కొనసాగనుంది. అమలాపురం మండల పరిషత్ కార్యాలయంలో నూతన జడ్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తయ్యే వరకు కలెక్టర్ మహేష్ కుమార్ ప్రత్యేక అధికారిగా వ్యవహరించనున్నారు. జిల్లాలోని 19 మండలాలకు వివిధ శాఖల ఉన్నతాధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. అధికారులు ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ, పరిపాలన కొనసాగింపుపై దృష్టి సారించనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.