ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం తలమడుగు గ్రామంలో మావల సిఎఫ్ఎల్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ కమలాకర్ మాట్లాడుతూ సంపాదించే డబ్బును పొదుపు చేసుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. ఆర్థిక ఎదుగుదలకు బడ్జెట్ ప్రణాళిక తప్పదని అన్నారు. ప్రతి ఒక్కరు బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని ఖాతాకి కేవైసీ చేసుకోవాలని, నామిని పెట్టాలని తెలిపారు. వ్యక్తిగత సమాచారం గుర్తు తెలియని వ్యక్తులకు తెలుపవద్దని, సైబర్ మోసాలపై ఎలాంటి అనుమానం ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ 1930కు సంప్రదించాలన్నారు. సామాజిక భద్రత పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

డబ్బు పొదుపు చేసుకొని ఆర్థికంగా ఎదగాలి – కమలాకర్