Thursday, 30 July 2026
  • Home  
  • జేఆర్‌పేటలో ఇంటింటికీ టీడీపీ ప్రచారం
- News - ఆంధ్రప్రదేశ్ - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జేఆర్‌పేటలో ఇంటింటికీ టీడీపీ ప్రచారం

‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమానికి ప్రజల విశేష స్పందన ఆత్మకూరు, July 30 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని జేఆర్‌పేట 4వ వార్డులో గురువారం తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రచార కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి, 20వ వార్డు మాజీ కౌన్సిలర్ సూర భాస్కర్ రెడ్డి, వార్డు అధ్యక్షుడు కాపా వెంకటసుబ్బయ్య, యూనిట్ ఇన్‌చార్జి దాసరి బాలకృష్ణ, 4వ వార్డు టీడీపీ సీనియర్ నాయకుడు దాసరి మధుసూదనరావు, మైనారిటీ నాయకుడు షేక్ నాయబ్ రసూల్ పాల్గొన్నారు. అదేవిధంగా 128, 130 బీఎల్‌ఏలు దేవరాయపల్లి ధనుంజయ, మునగల వెంకటరమణ (చంటి), పార్టీ నాయకుడు కిన్నెర నరసింహారావుతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రజలను కలిసి ప్రభుత్వ పనితీరును వివరించారు. ఈ ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని నాయకులు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేసేలా పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమానికి ప్రజల విశేష స్పందన

ఆత్మకూరు, July 30 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా చేపట్టిన “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని జేఆర్‌పేట 4వ వార్డులో గురువారం తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రచార కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు తుమ్మల చంద్రారెడ్డి, 20వ వార్డు మాజీ కౌన్సిలర్ సూర భాస్కర్ రెడ్డి, వార్డు అధ్యక్షుడు కాపా వెంకటసుబ్బయ్య, యూనిట్ ఇన్‌చార్జి దాసరి బాలకృష్ణ, 4వ వార్డు టీడీపీ సీనియర్ నాయకుడు దాసరి మధుసూదనరావు, మైనారిటీ నాయకుడు షేక్ నాయబ్ రసూల్ పాల్గొన్నారు.

అదేవిధంగా 128, 130 బీఎల్‌ఏలు దేవరాయపల్లి ధనుంజయ, మునగల వెంకటరమణ (చంటి), పార్టీ నాయకుడు కిన్నెర నరసింహారావుతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రజలను కలిసి ప్రభుత్వ పనితీరును వివరించారు.

ఈ ప్రచార కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని నాయకులు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేసేలా పార్టీ శ్రేణులు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.