Wednesday, 29 April 2026
  • Home  
  • జెఇఇ మెయిన్స్‌లో భీమవరం విద్యార్థుల ప్రతిభ – ఆలిండియా ర్యాంకులతో మెరిసిన విద్యార్థులు
- పశ్చిమ గోదావరి

జెఇఇ మెయిన్స్‌లో భీమవరం విద్యార్థుల ప్రతిభ – ఆలిండియా ర్యాంకులతో మెరిసిన విద్యార్థులు

భీమవరం: కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన జెఇఇ మెయిన్స్–2026 పరీక్షల్లో భీమవరం తిరుమల విద్యాసంస్థల విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చడం అభినందనీయం అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. బుధవారం ఎమ్మెల్యే కార్యాలయంలో శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆలిండియా ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయన సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జెఇఇ మెయిన్స్‌లో ఆలిండియా 3వ ర్యాంకు సాధించడం గొప్ప విషయం అని అన్నారు. విద్యార్థుల కృషి, గురువుల మార్గదర్శకత్వం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు: బి కౌషల్ – 3వ ర్యాంకు కె జాస్మిత – 17వ ర్యాంకు బి వెంకట రమణ – 18వ ర్యాంకు జి మోనిషా – 112వ ర్యాంకు సిహెచ్ ధనుంజయ బాలాజీ – 174వ ర్యాంకు పి మోహిత్ కృష్ణసాయి – 222వ ర్యాంకు ఐ రోహిత్ కుమార్ – 252వ ర్యాంకు జి రోషిత్ – 327వ ర్యాంకు పి వర్షిత్ – 474వ ర్యాంకు జెహెచ్ లక్ష్మణ్ కుమార్ – 638వ ర్యాంకు ఎన్ కరుణ సాహితి – 674వ ర్యాంకు పి నరసింహ వర్మ – 744వ ర్యాంకు సిహెచ్ భాస్కర శ్రీశేష సాత్విక్ – 844వ ర్యాంకు ఆర్ జాహ్నవి – 894వ ర్యాంకు విద్యాసంస్థల డైరెక్టర్లు పి శ్రీనివాస్ వర్మ, జి సతీష్ బాబు, ఎస్ సాయిరాజు మాట్లాడుతూ మొత్తం 9 మంది విద్యార్థులు ఆలిండియా టాప్ 500లో, 14 మంది టాప్ 1000లో స్థానం సంపాదించారని తెలిపారు. భీమవరం బ్రాంచ్ నుంచే సుమారు 125 మందికి పైగా విద్యార్థులు ఎన్ఐటీ, ఐఐఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో అడ్మిషన్లు పొందే అవకాశం ఉందన్నారు. కార్యక్రమం చివర్లో విద్యార్థులకు మెడల్స్ అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, ఏవో శ్రీనివాస్, సురేష్ రెడ్డి, వబిలిశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

భీమవరం: కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన జెఇఇ మెయిన్స్–2026 పరీక్షల్లో భీమవరం తిరుమల విద్యాసంస్థల విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చడం అభినందనీయం అని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు.
బుధవారం ఎమ్మెల్యే కార్యాలయంలో శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆలిండియా ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆయన సత్కరించి అభినందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జెఇఇ మెయిన్స్‌లో ఆలిండియా 3వ ర్యాంకు సాధించడం గొప్ప విషయం అని అన్నారు. విద్యార్థుల కృషి, గురువుల మార్గదర్శకత్వం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.
అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు:

బి కౌషల్ – 3వ ర్యాంకు

కె జాస్మిత – 17వ ర్యాంకు

బి వెంకట రమణ – 18వ ర్యాంకు

జి మోనిషా – 112వ ర్యాంకు

సిహెచ్ ధనుంజయ బాలాజీ – 174వ ర్యాంకు

పి మోహిత్ కృష్ణసాయి – 222వ ర్యాంకు

ఐ రోహిత్ కుమార్ – 252వ ర్యాంకు

జి రోషిత్ – 327వ ర్యాంకు

పి వర్షిత్ – 474వ ర్యాంకు

జెహెచ్ లక్ష్మణ్ కుమార్ – 638వ ర్యాంకు

ఎన్ కరుణ సాహితి – 674వ ర్యాంకు

పి నరసింహ వర్మ – 744వ ర్యాంకు

సిహెచ్ భాస్కర శ్రీశేష సాత్విక్ – 844వ ర్యాంకు

ఆర్ జాహ్నవి – 894వ ర్యాంకు

విద్యాసంస్థల డైరెక్టర్లు పి శ్రీనివాస్ వర్మ, జి సతీష్ బాబు, ఎస్ సాయిరాజు మాట్లాడుతూ మొత్తం 9 మంది విద్యార్థులు ఆలిండియా టాప్ 500లో, 14 మంది టాప్ 1000లో స్థానం సంపాదించారని తెలిపారు. భీమవరం బ్రాంచ్ నుంచే సుమారు 125 మందికి పైగా విద్యార్థులు ఎన్ఐటీ, ఐఐఐటీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో అడ్మిషన్లు పొందే అవకాశం ఉందన్నారు.
కార్యక్రమం చివర్లో విద్యార్థులకు మెడల్స్ అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, ఏవో శ్రీనివాస్, సురేష్ రెడ్డి, వబిలిశెట్టి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.