అనంతసాగరం సెప్టెంబర్ 11,పున్నమి ప్రతినిధి:
నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ గా 7 ఏళ్లుగా పని చేసిన నేత, ప్రజారాజ్యం నుండి మెగా ఫ్యామిలీతో వున్న నాయకుడు నలిశెట్టి శ్రీధర్ పుట్టినరోజు సందర్బంగా శుక్రవారం ఆత్మకూరు నియోజక వర్గ జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో నలి శెట్టి శ్రీధర్ ని అనంతసాగరం జనసేన పార్టీ సీనియర్ నాయకులు కె ఎస్ భరత్, ఉదయగిరి రవి, బివి రమణ, నాగరాజు యాదవ్ మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా అనంతసాగరం జనసేన పార్టీ సీనియర్ నాయకులు కె ఎస్ భరత్ ఆధ్వర్యంలో నలిశెట్టి శ్రీధర్ ని శాలువా తో ఘనంగా సన్మానించారు..


