ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పల్లిపాడు కోల్డ్ స్టోరేజ్ సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. సత్తుపల్లి నుంచి ఖమ్మం వస్తున్న సత్తుపల్లి డిపో బస్సు ఎదురుగా వచ్చిన ట్రాలీని ఢీకొట్టి చెట్టును గుద్దింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు గాయపడగా, వారిని 108 అంబులెన్సుల ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.



