ఖమ్మం: వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయమని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసుధన్ అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను నిర్వహించి, ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తాత మధుసుధన్ మాట్లాడుతూ నిజాం దొరల దౌర్జన్యాలు, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా ఐలమ్మ చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఐలమ్మ జయంతికి అధికారిక గుర్తింపు కల్పించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. నేటి యువత ఆమె ఆశయాలను ఆదర్శంగా తీసుకొని, సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ చరిత్రలో ఐలమ్మ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు.



