Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

గ్రామ అభివృద్ధే నా లక్ష్యం – ఉదయ్ కుమార్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గ్రామ అభివృద్ధే నా లక్ష్యం – ఉదయ్ కుమార్

*మా TDP సర్పంచ్ అభ్యర్థి ఉదయ్ కుమార్*

గ్రామంలో పెండింగ్ లో ఉన్న ప్రధాన సమస్యలను పరిష్కరించేందుకు తాను సర్పంచ్ గా పోటీ చేస్తున్నట్లు ఉదయ్ కుమార్ ప్రకటించారు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో రోడ్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గెలిచిన వెంటనే సిమెంట్ రోడ్లు వేయించి, అన్ని వీధులకు మంచి డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు.

గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు అందించేందుకు కొత్త పైప్ లైన్ వేయించి, ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి 24 గంటల తాగునీటి సరఫరా అందిస్తామని తెలిపారు. వ్యవసాయమే మా గ్రామానికి వెన్నెముక. రైతులకు సబ్సిడీకి విత్తనాలు, ఎరువులు, పంటలకు గిట్టుబాటు ధర, వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల విద్యుత్ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు.

యువతకు ఉపాధి కల్పించేందుకు గ్రామంలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, కంప్యూటర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ వంటి ఉచిత శిక్షణ ఇప్పిస్తామని, ఉద్యోగ అవకాశాల కోసం స్థానికంగా చిన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తామని చెప్పారు.

గ్రామ పంచాయతీ భవనాన్ని ఆధునీకరించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా కొత్త పంచాయతీ కార్యాలయ భవనం నిర్మిస్తామని, ప్రతి ఇంటి ముందు పారిశుధ్యం, పచ్చదనం పెంచుతామని తెలిపారు. పేదలకు ఇళ్లు లేని వారికి ప్రభుత్వ పథకాల ద్వారా ఇళ్లు మంజూరు చేయించి, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్లు అందేలా చూస్తామని అన్నారు.

*గ్రామం అంటే మన కుటుంబం. అందరినీ కలుపుకొని పోయి అభివృద్ధి చేస్తాను, మీ ఆశీస్సులు, మీ మద్దతు నాకు కావాలి – ఉదయ్ కుమార్*

*మా ఊరి కోసం… అభివృద్ధి కోసం… సైకిల్ గుర్తుకే ఓటు వేసి ఉదయ్ కుమార్ ని మెజారిటీతో గెలిపించండి!*

*ముఖ్య హామీలు:*
– ప్రతి వీధికి సిమెంట్ రోడ్లు & డ్రైనేజీ నిర్మాణం
– ప్రతి ఇంటికి శుద్ధ తాగునీరు & ఓవర్ హెడ్ ట్యాంక్
– రైతులకు సబ్సిడీ విత్తనాలు, పంటలకు గిట్టుబాటు ధర
– యువతకు ఉచిత స్కిల్ ట్రైనింగ్ & ఉపాధి కేంద్రం

*ప్రజల మాట:* “ఉదయ్ కుమార్ యువకుడు, మాకు అందుబాటులో ఉండి పని చేస్తాడనే నమ్మకం ఉంది” – గ్రామస్తులు

గ్రామ అభివృద్ధే నా లక్ష్యం – ఉదయ్ కుమార్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *