వార్త ముఖ్యాంశాలు
- ప్రజాసత్తా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కన్నలి డోరతి మృతి సంస్థకు తీరనిలోటని వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు పులగర శోభనబాబు పేర్కొన్నారు.
- నాయుడుపేటలో ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు.
- 2004 నుంచి జిల్లా కార్యదర్శిగా, కోఆర్డినేటర్గా డోరతి అనేక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని గుర్తుచేశారు.
ప్రజాసత్తా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కన్నలి డోరతి మృతి సంస్థకు తీరనిలోటని వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు పులగర శోభనబాబు పేర్కొన్నారు. నాయుడుపేటలో ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. 2004 నుంచి జిల్లా కార్యదర్శిగా, కోఆర్డినేటర్గా డోరతి అనేక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారని గుర్తుచేశారు. నాలుగు నెలల క్రితమే ఆమె భర్త, రిటైర్డ్ ప్రభుత్వ హాస్టల్ వార్డెన్ పోతల సురేంద్రనాథ్ ముఖర్జీ మరణించగా, తాజాగా అనారోగ్యంతో డోరతి మృతిచెందడం బాధాకరమన్నారు. ఆమె సేవలు ఆదర్శప్రాయమని కొనియాడుతూ, కుమారుడు, కుమార్తెతోపాటు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్