Monday, 14 September 2026

Tag: C

తిరుపతి

కుప్పారెడ్డి పాలెంలో నూతన ఆలయానికి భూమి పూజ*

దొరవారిసత్రం, ఆగస్టు 27 (పున్నమి న్యూస్)* తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలం కుప్పారెడ్డి పాలెం గ్రామంలో నూతన ఆలయ నిర్మాణానికి బుధవారం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య భూమి పూజ నిర్వహించారు. గ్రామ అభివృద్ధి మరియు భక్తుల మనోభీష్టం మేరకు ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఇటుకలకు పసుపు కుంకుమలతో అలంకరించి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఊరి పెద్దలు శివ రెడ్డి గారు,సుబ్బా రెడ్డి గారు,బుజమ్మ గారు శ్రీనా రెడ్డీ గారు, శ్రీధర్ రెడ్డి గారు,జమ్మల మణి గారు, జమ్మల ఉమాపతి గారు, జమ్మల మనోహర్ గారు, కిన్నెరి రమణయ్య గారు, కిన్నెరి హరిబాబు గారు తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తిరుపతి

*నాయుడుపేటకు మెమో రైలును పొడిగించాలి*

చెన్నై నుంచి సూళ్లూరుపేట వరకు నడుస్తున్న మెమో ప్యాసింజర్ రైలును నాయుడుపేట వరకు పొడిగించాలని కోరుతూ బిజెపి నాయకులు విజయ్ కుమార్, చెంచుకృష్ణయ్య లు మాజీ ఉపరాష్ట్రపతి ఎమ్ వెంకయ్యనాయుడుకు వినతిపత్రం సమర్పించారు. నెల్లూరులోని స్వర్ణభారతి ట్రస్ట్‌లో బుధవారం ఆయనను కలిసి స్థానిక రైల్వే సమస్యలపై చర్చించారు. చెన్నై నుండి సూళ్లూరుపేట వరకు నడుస్తున్న రైలును నాయుడుపేట వరకు పొడిగించడం వల్ల ఈ ప్రాంత ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని నేతలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన వెంకయ్యనాయుడు,ఈ విషయమై కేంద్ర రైల్వే శాఖ మంత్రితో స్వయంగా మాట్లాడి, సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నేతలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.